మున్సిపల్ ఎన్నికల వేళ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్‌, మజ్లిస్‌పై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల వేళ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్‌, మజ్లిస్‌పై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్‌తో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నాయని ఆరోపించారు. మతం పేరుతో కుట్రలు చేయాలనుకుంటున్నారని అన్నారు. ఈసారి బీజేపీ అవకాశం ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కరీంనగర్ రూపురేఖలు మారుస్తామని కీలక ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకొవడం ఆ మూడు పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, కరీంనగర్ ఎంపీ కేంద్రమంత్రిగా కొనసాగుతుండటం, అక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ కీలక నేత ఉండటంతో, అందరి చూపు కరీంనగర్ కార్పొరేషన్ వైపు ఉంది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌లో పాగా వేసేందుకు మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే డివిజన్‌లలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి.. ఆ క్రమంలో జంప్ జలానీలు పెరిగిపోవడంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక ఆసక్తి రేపుతోంది.

Next Story