బీజేపీ సభతో టీఆర్ఎస్ వర్గాల్లో గుబులు: బండి సంజయ్

by Disha Web Desk 4 |
Security is being increased for Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యమకారులను టీఆర్ఎస్ అవమానిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో గురువారం జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక ఆకాంక్షలతో రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరంతరం ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడిన మహిళ నాగమల్లు ఝాన్సీ అని స్పష్టం చేశారు. బీజేపీలో చేరాలని తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. వారికి సరైన గుర్తింపు ఇచ్చే బాధ్యత బీజేపీది అని వెల్లడించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కులదోసి అంబేడ్కర్ రాజ్యాంగం తెలంగాణలో అమల్లోకి తెద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి మోడీ కట్టుబడి ఉన్నారని, కేంద్రాన్ని బద్నాం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు సంపూర్ణంగా అందాలంటే.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మోడీది పులి మొహం అని...ఏ మొఖం పెట్టుకొని కేసీఆర్ దేశ పర్యటనకు వెళ్తున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పులి వస్తోంది మరీ కేసీఆర్ 2, 3తేదీలలో ఎక్కడికి వెళ్తారో చూడాలన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభ పెడ్తున్నారు అంటేనే టీఆర్ఎస్ వర్గాల్లో గుబులు మొదలైందన్నారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed