ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు బిగ్ అలర్ట్.. దడ పుట్టిస్తున్న థర్డ్-పార్టీ యాప్​లు

by Disha Web Desk 10 |
ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు బిగ్ అలర్ట్.. దడ పుట్టిస్తున్న థర్డ్-పార్టీ యాప్​లు
X

దిశ, ఫీచర్స్: "డర్టీ స్ట్రీమ్" మాల్వేర్ ప్రతి ఒక్కర్ని భయపెట్టిస్తుంది. దీంతో సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ప్రతి సెల్‌ఫోన్‌లోని మొత్తం డేటా దొంగిలించబడుతుంది. తాజాగా.. మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ టీమ్ ఆండ్రాయిడ్ యూజర్లను హెచ్చరించింది. రెడ్ బెల్ మోగించింది. "డర్టీ స్ట్రీమ్" మాల్వేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఎలా టార్గెట్ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

1.డర్టీ స్ట్రీమ్ ఒక ప్రమాదకరమైన మాల్వేర్. ఇది కొన్ని యాప్‌ల ద్వారా కూడా మీ ఫోన్‌లోకి దూరిపోతుంది.

2. డర్టీ స్ట్రీమ్ మాల్వేర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని కంటెంట్ డెలివరీ సిస్టమ్‌లపై దాడి చేసే ప్రమాదం ఉంది. దాడి తర్వాత, ఫోన్ దాని నియంత్రణలో ఉంటుంది.

3. మీ ఫోన్ డర్టీ స్ట్రీమ్ ద్వారా హ్యాక్ చేయబడిన తర్వాత, దానిలోని అన్ని ఫైల్‌లు రహస్య సర్వర్‌కు బదిలీ చేయబడతాయి.

4. హ్యాకర్లు మన ఫోన్‌లలోని యాప్‌లను స్వాధీనం చేసుకుని ఎవరికైనా మెసేజ్‌లను పంపిస్తారు..

5. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించడం మానుకోండి.

6. కచ్చితంగా గూగుల్ ప్లే ప్రొటెక్ట్​ను ఎనేబుల్ చేసుకోవాలి.

7. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లను సైడ్‌లోడ్ చేయకూడదు. అదనపు ప్రోగ్రామ్‌లు ప్రమాదకరమైన వైరస్‌లు మీ ఫోన్‌లోకి ప్రవేశించేలా చేస్తాయి.

Next Story