ఈ రోజు చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్న మాజీ మంత్రి కేటీఆర్

by Disha Web Desk 12 |
ఈ రోజు చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్న మాజీ మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కి సంబంధించిన ఫేక్ సర్క్యూలర్ ను వైరల్ చేసిన కేసులో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్.. మన్నె క్రిశాంక్ పోలీసులు కస్టడీలో భాగంగా చంచల్ గూడ జైలులో ఉన్నాడు. దీంతో ఈ రోజు కేటీఆర్ క్రిశాంక్ ను ఉదయం 11 గంటలకు ములాఖత్ మీద పరామర్శించనున్నారు. ఇందుకోసం కేటీఆర్ జైలు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఓయూ పోలీసులు క్రిశాంక్ ను మే 1న అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

Next Story