డిప్యూటి సీఎం భ‌ట్టిని కలిసిన బాలు నాయక్

by Ratna Kumari |

దేవరకొండ నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.

డిప్యూటి సీఎం భ‌ట్టిని కలిసిన బాలు నాయక్
X

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల విస్తరణ తదితర అంశాలపై డిప్యూటీ సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. దేవరకొండ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. దేవరకొండ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Next Story