- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బక్రీద్ సెలవు ఎఫెక్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మార్పు
మే 28న జరగాల్సిన ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు బక్రీద్ సెలవు కారణంగా జూన్ 5వ తేదీకి వాయిదా పడ్డాయి. పాత హాల్ టికెట్లే వర్తిస్తాయి.

దిశ, వెబ్ డెస్క్: బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28వ తేదీని పబ్లిక్ హాలిడే గా ప్రకటించిన నేపథ్యంలో.. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (IPASE) షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 28 న జరగాల్సిన పరీక్షలను జూన్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సవరించిన టైమ్ టేబుల్ ప్రకారం.. మే 28 న జరగాల్సిన ప్రథమ సంవత్సరం (First Year) ఆర్థికశాస్త్రం (ఎకనామిక్స్), వృత్తి విద్య బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీ ఉదయం పూట నిర్వహించనున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం (Second Year) గణితం, వృత్తి విద్య బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం సెషన్‌లో నిర్వహిస్తారు.
ఇదే సమయంలో, గతంలో జూన్ 5వ తేదీన నిర్వహించాల్సి ఉన్న ముందస్తు షెడ్యూల్డ్ నిబంధనల పరీక్ష 'ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్' పరీక్షను బోర్డు మరింత ముందుకు జరిపింది. ఈ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఇప్పుడు జూన్ 12, 2026 న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే, పరీక్ష తేదీలలో మార్పులు జరిగినప్పటికీ.. అభ్యర్థులు తమకు ఇదివరకే జారీ చేసిన పాత హాల్ టికెట్లతోనే, పాత పరీక్షా కేంద్రాలకే హాజరుకావాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. మిగిలిన అన్ని ఇంటర్ పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా జరుగుతాయని కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు.






