తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్

by Gantepaka Srikanth |

తెలంగాణ మందుబాబులకు ఎక్సైజ్ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మందుబాబుల(Telangana Alcohol Lovers)కు ఎక్సైజ్ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, డ్రై డే కారణంగా మద్యం షాపులు, బార్‌లు మరియు పబ్‌లు మూసివేయబడతాయి. ఇది జాతీయ సెలవు కాబట్టి శాంతిభద్రతల దృష్ట్యా రోజంతా అమ్మకాలపై నిషేధం ఉంటుంది. మరోవైపు గణతంత్ర దినోత్సవ(Republic Day 2026) వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శనివారం భారీ తనిఖీలు నిర్వహించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేగ్రౌండ్స్‌లో పోలీసుల రిహార్సల్స్, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా జరిగాయి.

Next Story