War 2 Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ .. వార్2 రిలీజ్ వాయిదా? షూటింగ్ లో స్టార్ హీరోకి గాయాలు!

by Phanindra |   (  Updated:2025-03-12 07:28:24  IST  )

హృతిక్ రోషన్- ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ చిత్రం 'వార్ 2'.

War 2 Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ .. వార్2 రిలీజ్ వాయిదా? షూటింగ్ లో స్టార్ హీరోకి గాయాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : హృతిక్ రోషన్- ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ చిత్రం 'వార్ 2'. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.యంగ్ టైగర్ 'వార్ 2' నటిస్తున్న మొదటి స్ట్రెయిట్‌ హిందీ మూవీ కావడంతో ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లుజల్లింది.

తెలిసిన సమాచారం ప్రకారం.. వార్ 2 అనుకున్న సమయం కన్నా ఇంకా ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, గతకొద్ది రోజులుగా ముంబై లో ఎన్టీఆర్- హృతిక్ పై భారీ సెట్టింగ్ వేసి ఒక పాటను తీస్తున్నారు . ఈ ఒక్క పాటలో 500 మందికి పైగా డాన్సర్లు దీనిలో పాల్గొంటున్నారు. కాగా, ఈ పాట షూటింగ్ చేసే సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో, డాక్టర్స్ ఆయనను 40 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో #NTRNeel, మరోవైపు దేవర పార్ట్ 2 షూటింగ్ లోపాల్గొంటున్నారు. రీసెంట్ గా, #NTRNeel షూటింగ్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే, ఫస్ట్ డే షూటింగ్ నుంచి ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఫొటోను షేర్ చేయగా.. అది నిముషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. ఈ యాక్షన్ సీన్ లో మొత్తం 1000 మందికి పైగా జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

Read More..

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఇచ్చిన బంపర్ ఆఫర్లో బైక్ గెలుచుకుంది ఇతనే..!

Next Story