Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఇచ్చిన బంపర్ ఆఫర్లో బైక్ గెలుచుకుంది ఇతనే..!

by Phanindra |   (  Updated:2025-03-12 14:53:16  IST  )

కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ) , రుక్సర్ థిల్లాన్ కలిసి నటించిన మూవీ " దిల్ రూబా " ( Dil Ruba ) .

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు ఇచ్చిన బంపర్ ఆఫర్లో బైక్ గెలుచుకుంది ఇతనే..!
X

దిశ, వెబ్ డెస్క్ : కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ) , రుక్సర్ థిల్లాన్ కలిసి నటించిన మూవీ " దిల్ రూబా " ( Dil Ruba ) . ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మార్చి 14న విడుదల కానుంది. మంగళ వారం రాత్రి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే, కొద్దీ రోజుల క్రితం కిరణ్ అబ్బవరం ఆడియెన్స్ కు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.

ఈ మూవీలో కిరణ్ అబ్బవరం స్పెషల్ గా తయారు చేసిన ఓ బైక్ ని వాడాడు. అది తన ఫేవరేట్ బైక్ అయిందని, ఆ బైక్ నే వాడానని చెప్పాడు. టీజర్, పాటలు చూసి మా సినిమా కథని కరెక్ట్ గా కనిపెట్టి రాసి పంపిన వాళ్ళకి మేమే పిలిచి ఈ బైక్ ని గిఫ్ట్ గా ఇస్తామని కిరణ్ తెలిపాడు. అలా .. ఈ కాంటెస్ట్ లో ఎంతో మంది పాల్గొన్నారు. అలా గెలిచిన వ్యక్తికి మంగళవారం రాత్రి ఈవెంట్లో ఈ బైక్ ని బహుమతిగా ఇచ్చాడు.హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. " కర్నూల్ నుంచి రామాంజనేయులు అనే పర్సన్ ఈ బైక్ ను గెలుచుకున్నాడు, కంగ్రాట్స్. 20 వేల మంది పోస్ట్ చేశారు. దానిలో మా టీమ్ చాలా కష్టపడి 20 మంది కరెక్ట్ గా రాసిన వాళ్ళను ఫైనల్ చేశారు. బాగా ఆలోచించి లక్కీ డిప్ తీయాలని ఫిక్స్ అయ్యాము. అలా ఇతనికి బైక్ వచ్చింది. ఈ బైక్ ఇతనికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం. అది ,ఈ తమ్ముడు గెలుచుకున్నాడు కంగ్రాట్స్ " చెబుతూ అతనికి బైక్ ఇచ్చారు.

బైక్ ను గిఫ్ట్ గా పొందిన వ్యక్తి మాట్లాడుతూ.. " ఇది నేను అస్సలు ఊహించలేదు. మనకి ఏం వస్తాదిలే అనుకున్నాను. కానీ, నేను ఊహించిన కథను అలా పోస్ట్ చేశాను. నిన్న నైట్ నాకు టీమ్ నుంచి కాల్ వచ్చింది. నేను ముందు షాక్ అయ్యా .. నువ్వు బైక్ ను గెలుచుకున్నావు, రేపు సాయంత్రం ఈవెంట్ ఉంది. ఇక్కడికి రావాలని చెప్పారు. నేను వచ్చాక మూవీ టీమ్ గెస్ట్ లా చూసుకున్నారు. కిరణ్ అన్నతో మధ్యాహ్నం భోజనం చేశాను. చాలా బాగా మాట్లాడాడు. ఈ మూవీ పక్కా అవుతుంది. ఇందాక నిర్మాత గారు మాట్లాడుతూ ఈ చిత్రం నచ్చకపోతే నన్ను కొట్టండి అని చెప్పారు. ఒక వేళ హిట్ అవ్వకపోతే ఆయనతో పాటు నన్ను కూడా కొట్టండి " అంటూ అతని మాటల్లో చెప్పాడు.

READ MORE ...

Kiran Abbavaram: ఆ సినిమాలతో ‘దిల్ రూబా’కు ఎలాంటి పోలిక ఉండదు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్

Next Story