Varun Dhawan: ‘బేబీ జాన్’ సినిమా అప్డేట్ విడుదల.. క్యూరియాసిటీ పెంచుతున్న వీడియో

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), డైరెక్టర్ కలీస్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘బేబీ జాన్’(Baby John).

Varun Dhawan: ‘బేబీ జాన్’ సినిమా అప్డేట్ విడుదల.. క్యూరియాసిటీ పెంచుతున్న వీడియో
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), డైరెక్టర్ కలీస్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘బేబీ జాన్’(Baby John). అయితే ఈ సినిమాతో నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కామియో రోల్‌లో కనిపించబోతుండగా.. సినీ 1 స్టూడియోస్, జీయో స్టూడియోస్‌తో కలిసి జ్యోతి దేశ్‌పాండే, మురాద్, ఖేతానీ, ప్రియా అట్లీ(Priya Atlee) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ కావడంతో ‘బేబీ జాన్’(Baby John) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ మూవీ డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘బేబీ జాన్’(Baby John) మూవీ మేకర్స్ టేస్టర్ కట్ వీడియోను షేర్ చేస్తూ ‘ఒకవేళ ఇది మొదలు అయితే.. రాబోయే భవిష్యత్తును ఉహించుకోండి’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇందులో బేబీ వాయిత్ ఓవర్‌తో స్టార్ట్ అయిన వీడియోలో వరుణ్ స్టన్నింగ్ కాప్‌గా(Stunning Cop) స్టైలిష్ అవతార్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించారు. ఇక కీర్తి సురేష్ గ్లామరస్‌(glamorous)గా కనిపించి అందరికీ మంత్ర ముగ్దులను చేస్తోంది. ప్రజెంట్ బేబీ జాన్ అప్డేట్ అందరిలో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story