- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెపాక్‌లో ఆయుష్ మాత్రే సంచలనం..సురేష్ రైనా 18 ఏళ్ల రికార్డు బ్రేక్
చెపాక్‌లో ఆయుష్ మాత్రే సరికొత్త రికార్డు! 18 ఏళ్లకే రైనా రికార్డు బ్రేక్ చేసి హాఫ్ సెంచరీ సాధించిన యంగెస్ట్ సీఎస్‌కే ప్లేయర్‌గా నిలిచాడు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో యువ ప్లేయర్లు సంచలనంగా మారుతున్నారు. శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ, ఆ జట్టు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే తన అద్భుత ప్రదర్శనతో అందరి మనసు గెలుచుకున్నాడు. కేవలం 43 బంతుల్లో 73 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసిన మాత్రే, చెన్నై జట్టుకు 209 పరుగుల భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే చెన్నై హోమ్ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజం సురేష్ రైనా పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును మాత్రే తుడిచిపెట్టాడు.
అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు..
కేవలం 18 ఏళ్ల 261 రోజుల వయసులోనే చెపాక్ స్టేడియం లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన సీఎస్‌కే ప్లేయర్‌గా ఆయుష్ మాత్రే చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో ముంబై ఇండియన్స్‌పై రైనా (21 ఏళ్ల 148 రోజులు) చేసిన హాఫ్ సెంచరీనే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. ఈ ఇన్నింగ్స్‌తో ఆయుష్ మాత్రే, పృథ్వీ షా, వైభవ్ సూర్యవంశీ సరసన 19 ఏళ్ల లోపే ఒకటి కంటే ఎక్కువ ఐపీఎల్ హాఫ్ సెంచరీలు చేసిన ఎలైట్ లిస్టులో చేరాడు. ముంబైకి చెందిన ఈ యువ ఆటగాడు గత ఏడాది అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలబెట్టడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఐపీఎల్ వేదికగా రైనా వంటి దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేస్తూ టీమ్ ఇండియా భవిష్యత్ ఆశాకిరణం గా మారుతున్నాడు.






