- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయేషా మీరా హత్య కేసు.. ఈనెల 29 కి వాయిదా
విజయవాడలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన కీలక విచారణ శుక్రవారం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలోని సీబీఐ స్పెషల్ కోర్టులో ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన కీలక విచారణ శుక్రవారం జరిగింది. ఆయేషా తల్లిదండ్రులు మొహమ్మద్ ఇస్మాయిల్, షాహిదా బేగం దాఖలు చేసిన పిటిషన్‌పై జడ్జి ఎం. రాజశేఖర్ రెడ్డి విచారణ చేపట్టారు. సీబీఐ సమర్పించిన దర్యాప్తు నివేదికపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, ఆ నివేదికను పూర్తిగా విడుదల చేసి తమకు అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని తల్లిదండ్రులు కోరారు. దీనిపై స్పందించిన కోర్టు, సీబీఐ నివేదికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 29 నాటికి సమర్పించాలని ఆదేశిస్తూ, కేసు విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. సీబీఐ తరపు న్యాయవాది కూడా నివేదికపై మరింత సమయం కావాలని కోరగా కోర్టు అంగీకరించింది.
2007 లో విజయవాడలో 19 ఏళ్ల ఆయేషా మీరా హత్యకు గురికాగా.. ఈకేసు అనేక మలుపులు తిరిగింది. మొదట పోలీసులు దర్యాప్తు చేసిన ఈ కేసు, తల్లిదండ్రుల విజ్ఞప్తితో 2024 జూలైలో సీబీఐకి బదిలీ అయింది. సీబీఐ సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా, ఫోరెన్సిక్ రిపోర్టులు వంటి ఆధారాలు సేకరించినప్పటికీ, ఇంకా కొన్ని కీలక అంశాలు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కేసు ట్రయల్ దశకు చేరకపోవడంతో.. జనవరి 29న జరిగే తదుపరి విచారణ కీలకం కానుంది.






