- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టి పరీక్షలు, మట్టి నమూనాల సేకరణ పై అవగాహన కార్యక్రమం
మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లో బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మంగళవారం గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం (RAWE)లో భాగంగా రైతులకు మట్టి పరీక్షలు, మట్టి నమూనాల సేకరణ విధానం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

దిశ, నర్సాపూర్ : మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లో బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మంగళవారం గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమం (RAWE)లో భాగంగా రైతులకు మట్టి పరీక్షలు, మట్టి నమూనాల సేకరణ విధానం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి పరీక్షల ప్రాముఖ్యత, పరీక్ష కోసం మట్టి నమూనాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించే విధానం, అలాగే సాయిల్ హెల్త్ కార్డు ప్రాముఖ్యత, దాని ఉపయోగాల గురించి వివరించారు. మట్టి పరీక్షల ద్వారా నేలలోని పోషకాల స్థితిని తెలుసుకొని, అవసరానికి అనుగుణంగా ఎరువులను సముచితంగా వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని, సారవంతతను కాపాడుకోవడంతో పాటు మెరుగైన పంట దిగుబడులను సాధించవచ్చని రైతులకు తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులు సిమ్మి తానియా, శ్రీకరిని, వాసవి, హర్షిత నిర్వహించారు.






