- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. ఇక చలాన్ మోత మోగుద్ది!
యూ టర్న్ తీసుకోవడానికి బద్ధకించి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్‌లో వెళ్లే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

దిశ, వెబ్ డెస్క్ : యూ టర్న్ తీసుకోవడానికి బద్ధకించి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్ రూట్‌లో వెళ్లే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో రద్దీ ఎక్కువగా ఉండే కీలక ప్రాంతాలలో ప్రత్యేక ఆటోమేటిక్ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిసారీ ట్రాఫిక్ కానిస్టేబుల్ స్వయంగా నిలబడి ఫోటోలు తీయాల్సిన అవసరం లేకుండా, ఈ ఆధునిక ఆటోమేటిక్ కెమెరాలే రాంగ్ రూట్‌లో వచ్చే వాహనాలను గుర్తిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల ఫోటోలు, వీడియోలను రికార్డు చేసి, సదరు వాహన రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా యూజర్ చార్జీలతో కలిపి మొత్తం రూ.1235 భారీ చలానాను ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తాయి.
ఇప్పటికే నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ ఆటోమేటిక్ కెమెరా వ్యవస్థను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సరికొత్త టెక్నాలజీతో రాంగ్ రూట్‌లో వెళ్లే వాహనదారులకు భారీగా చలాన్ల మోత మోగుతున్నట్లు సమాచారం. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆటోమేటిక్ చలాన్ల విధానం వల్లనైనా వాహనదారుల ప్రవర్తనలో మార్పు వస్తుందని, ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.






