- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై బంగారు నగల బ్యాగ్.. ఆటో డ్రైవర్ చేసిన పనికి వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
మార్గమధ్యలో దొరికిన విలువైన బంగారు ఆభరణాలు తిరిగి అప్పగించి ఒక ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు.

దిశ,రేగోడ్: మార్గమధ్యలో దొరికిన విలువైన బంగారు ఆభరణాలు తిరిగి అప్పగించి ఒక ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లి గ్రామానికి చెందిన విజయ అనే మహిళ రూ.1 లక్ష విలువైన తన బంగారు నగలను రోడ్డుపై పోగొట్టుకుంది. అదే రోడ్డు మార్గంలో ప్రయానిస్తున్న సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బెల్లాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ విజయ్‌కుమార్‌కు ఆ నగలు దొరికాయి. వాటిని బంగారు నగలుగా గుర్తించిన ఆయన వెంటనే రేగోడ్ పోలీసులకు సమాచారం ఇచ్చి వాటిని అప్పగించాడు. పోలీసులు, స్థానికులు దొరికిన నగల విషయం పై తమకు దొరికిన ఆధారాలను బట్టి బాధితురాలికి సమాచారం ఇచ్చారు. బంగారు నగలను ఎస్సై పోచయ్య న్యాయవాది అలిగే జీవన్, టి.లింగపల్లి సర్పంచ్ ఆనందం సమక్షంలో బాధితురాలు విజయకు అందజేశారు. డ్రైవర్ విజయ్‌కుమార్ నిజాయితీని మెచ్చుకుని ఆయనను సన్మానించి పోలీసులు, స్థానికులు అభినందించారు.






