ఇండియన్ రైల్వేస్‌లో సరికొత్త చరిత్ర.. 120 కి.మీ వేగంతో పరుగులు పెట్టిన హైడ్రోజన్ ట్రైన్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-26 06:05:54  IST  )

ఇండియన్ రైల్వేస్ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదైంది.

ఇండియన్ రైల్వేస్‌లో సరికొత్త చరిత్ర.. 120 కి.మీ వేగంతో పరుగులు పెట్టిన హైడ్రోజన్ ట్రైన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రైల్వే (Indian Railways) చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ టార్గెట్‌గా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి గంటకు 120 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించేందుకు తన చివరి బూస్ట్ స్పీడ్ ట్రయల్ (Final Speed Trial) రన్‌ను విజయవంతంగా ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం వాడుకలో ఉన్న డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రైళ్లను ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెడుతోంది. ఈ రైళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ (Hydrogen Fuel Cells) టెక్నాలజీని ఉపయోగించారు. ఇవి హైడ్రోజన్, ఆక్సిజన్‌లను కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో రైలు నడిచేటప్పుడు పర్యావరణానికి హాని చేసే ఎలాంటి కార్బన్ పొగ బయటకు రాదు. కేవలం నీరు, ఆవిరి మాత్రమే బయటకు వదలడం విశేషం. జింద్ - సోనిపట్ ట్రైన్ స్పీడ్ టెస్ట్‌లో బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను రైల్వే రక్షణ కమిషన్ నిపుణులు పరిశీలిస్తున్నారు.

కాగా, హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ స్పీడ్ ట్రయల్ విజయవంతంగా ముగిసిన వెంటనే అది సర్వీసులోకి రానుంది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా దేశంలోని పర్యాటక, చారిత్రాత్మక మార్గాలైన షిమ్లా-కల్కా, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వంటి నారో గేజ్, హెరిటేజ్ రూట్లలో కూడా ఇలాంటి మరో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని భారత రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Next Story