- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. బిగ్గెస్ట్ అప్డేట్‌తో సోషల్ మీడియా షేక్!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎవరూ అస్సలు ఊహించని విధంగా ‘బాహుబలి-3’ రాబోతోందని ప్రభాస్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ రెండు భాగాలుగా వచ్చి బాక్సాఫీసును షేక్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తాను తెలిసేలా చేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఎవరూ ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఒక ప్రమోషనల్ వీడియోలో రెబల్ స్టార్ ప్రభాస్ స్వయంగా ఒక క్రేజీ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎవరూ అస్సలు ఊహించని విధంగా ‘బాహుబలి-3’ రాబోతోందని ప్రభాస్ అధికారికంగా ప్రకటించారు.
మీ అందరి కోసం బాహుబలి 3 వస్తోంది అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన స్పిరిట్, సలార్-2, కల్కి-2, ఫౌజీ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ టాలీవుడ్ యంగ్ హీరోల చిత్రాలకు సపోర్ట్‌గా నిలుస్తూ.. ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తన సినిమాల కంటే.. ఇతర ప్రాజెక్ట్స్ విషయంలోనే ఆయన ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా తన చిత్రాలకు సంబంధించిన అప్డే్ట్స్‌ను కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదో ఒక అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా.. ప్రభాస్ ‘బాహుబలి-3’ ప్రకటించడంతో అందరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.






