- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడి బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడి బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్
by Jakkula.Mamatha |
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన షేక్ లాల్‌సాబ్ నిజాయితీని చాటుకున్నారు.

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన షేక్ లాల్‌సాబ్ నిజాయితీని చాటుకున్నారు. గురువారం తన ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్‌ను మరిచిపోయి దిగిపోగా, దానిని గమనించిన లాల్‌సాబ్ వెంటనే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. లాల్‌సాబ్ చూపిన బాధ్యతాయుతమైన వైఖరిని అభినందించిన కోదాడ టౌన్ పోలీసులు, ఆయనను ఉత్తమ ఆటో డ్రైవర్‌గా ప్రశంసిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీ, సామాజిక బాధ్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన లాల్‌సాబ్ చర్యపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల ఆస్తిని భద్రంగా తిరిగి అందించాలనే ఆలోచనతో వ్యవహరించిన లాల్‌సాబ్ వంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శం అని పోలీసులు పేర్కొన్నారు.
Next Story






