- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరొకరితో భార్య ఎఫైర్.. స్వయంగా చూసి షాకైన భర్త
దిశ, వెబ్ డెస్క్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..Auto driver hacked to death by wife’s lover in TN

దిశ, వెబ్ డెస్క్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలు భర్తను ప్రియుడు హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కామాక్షికి చెందిన సెల్వరాజ్(35)కు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతను ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను ప్రియుడు చంపాలనుకున్నాడు. అనుకున్న విధంగా అతడి ఆటోకు గత సోమవారం రాత్రి నిప్పు పెట్టాడు అనంతరం మృతుడికి ఫోన్ చేశాడు. ఆటో కాలిపోతుంది అని చెప్పాడు. దీంతో అతను ఇంట్లో నుంచి బయటకొచ్చి చూడగా ఆటో మంటల్లో కాలిపోతోంది. వెంటనే ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వెనుక నుంచి భార్య ప్రియుడితోపాటు నలుగురు వ్యక్తులు అతడిని చుట్టుముట్టారు. అనంతరం అతడి గొంతుకోసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






