భారత సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లాడిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

by Disha Web |
భారత సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లాడిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్
X

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరికి 2020లోనే ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అయితే, కరోనా కారణంగా మ్యారేజ్ వాయిదా పడుతూ వచ్చింది. శనివారం క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మ్యాక్స్‌వెల్, వినీ రామన్ ఒక్కటయ్యారు.

ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్‌ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అలాగే, వినీ రామన్ సైతం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. మ్యాక్సీతో లిప్‌లాక్ ఫొటోను షేర్ చేసిన వినీ రామన్..'మిస్టర్ అండ్ మిసెస్ మ్యాక్స్‌వెల్..18.03.2022' అనే క్యాప్షన్ ఇచ్చింది. మ్యాక్స్‌వెల్, వినీరామన్ జంటకు క్రికెట్ ఆస్ట్రేలియా, ఆర్‌సీబీతోపాటు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు, విని రామన్ తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో భారత సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ మరోసారి వివాహం చేసుకుంటారని తెలుస్తున్నది. కాగా, వివాహం నేపథ్యంలో పాకిస్తాన్ టూ‌ర్‌కు దూరంగా ఉన్న మ్యాక్సీ.. మరో వారంలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.



Next Story

Most Viewed