కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ భేటీ

by Muthe.Rajitha |

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ గురువారం సమావేశమయ్యారు.

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ గురువారం సమావేశమయ్యారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యారంగంలో నూతన భాగస్వామ్యాలపై ప్రస్తావించారు. గతంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవమున్న కేటీఆర్.. ఈ అంశంలో అనేక అంశాలపై చర్చించారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిపై.. తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

Next Story