LPG క్రైసిస్.. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్లే యత్నం!

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద LPG గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది.

LPG క్రైసిస్.. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్లే యత్నం!
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో ఇప్పటికే పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ఎల్‌పీజీ (LPG) గ్యాస్ ఏజెన్సీలకు కూడా పాకడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆటోలో తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్న LPG గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. అయితే సిబ్బంది అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొంతసేపు తోపులాట కూడా చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు మాట్లాడుతూ.. సరఫరాలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అధికారిక విధానాల ప్రకారం బుకింగ్ చేసుకున్న వారికే సిలిండర్లు అందజేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. నగరంలో LPG సరఫరా విషయంలో అపోహలు వ్యాపించకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story