- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ స్థలం కబ్జా యత్నం : బోర్డు పాతిన రెవెన్యూ అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 24లో మొత్తం 84 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే భూములు కేటాయించినట్లు సమాచారం.

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ : అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుంట్లూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 24లో మొత్తం 84 ఎకరాల 21 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే భూములు కేటాయించినట్లు సమాచారం. మిగిలిన రెండు నుంచి మూడు ఎకరాల ప్రభుత్వ భూమిపై కొంతమంది వ్యక్తులు తమ సంఘానికి కేటాయించారని పేర్కొంటూ ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ నగర్ కాలనీకి ఎదురుగా ప్రధాన రహదారి వెంట ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం కావడంతో కొందరు జేసీబీలతో చదును చేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే సర్వే నంబరులో హయత్‌నగర్ రైతు సహకార సంఘం కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయాల నుంచి ఉత్తర్వులు జారీ చేసినట్లు సంఘం కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున్ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సంఘానికి కేటాయించిన 500 గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
కుంట్లూరు సర్వే నంబర్ 24లో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై అబ్దుల్లాపూర్‌మెట్ మండల రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ (ఎమ్మార్వో), పోలీసు శాఖ వెంటనే జోక్యం చేసుకొని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సహకార సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం తమ సంఘానికి కేటాయించిన 500 గజాల స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించి, సంఘానికి అప్పగించాలని కోరారు.






