భారత్ కు వస్తున్న నౌకపై దాడి

by Muthe.Rajitha |

భారత్ కు వస్తున్న థాయ్ కార్గో నౌకపై భారీ దాడి జరగగా.. ముగ్గురు సిబ్బంది మిస్ అయ్యారు.

భారత్ కు వస్తున్న నౌకపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు సముద్ర మార్గ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా యూఏఈ నుంచి భారత్ వైపు వస్తున్న ఒక భారీ కార్గో నౌకపై హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో భీకర దాడి జరిగింది. థాయ్‌లాండ్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీకి చెందిన 'మయూరీ నారీ' (Cargo Ship Mayuree Naree) అనే నౌక లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు రాయల్ థాయ్ నేవీ అధికారికంగా ధృవీకరించింది. థాయ్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక, యూఏఈలోని ఖలిఫా పోర్ట్ నుండి గుజరాత్‌లోని కాండ్లా పోర్ట్‌కు సరుకుతో వస్తుండగా ఈ దాడి జరిగింది. దాడి దృశ్యాలను రాయల్ థాయ్ నేవీ విడుదల చేసింది.

ఈ ఘటనలో నౌకలోని ముగ్గురు సిబ్బంది గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో, భారతదేశానికి వస్తున్న నౌకపై ఈ స్థాయిలో దాడి జరగడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడి వల్ల నౌకలోని సరుకుతో పాటు, సిబ్బంది భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని థాయ్ అధికారులు వెల్లడించారు.

Next Story