- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూకపల్లి గ్రామంలో దారుణం.. భార్యను గొంతు నులిమి చంపి, భర్త ఆత్మహత్య!
by Jakkula.Mamatha |
మండలంలోని నూకపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, మల్యాల: మండలంలోని నూకపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో భార్యాభర్తలు శవాలుగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన వోలపు నాగరాజు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తన భార్య లక్ష్మి గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య మరణించిందని గమనించిన నాగరాజు, తీవ్ర భయాందోళనకు గురై అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో నూకపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






