‘ప్రైవేట్ బడికి పంపం’.. స్కూల్ వ్యాన్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

by Jakkula.Mamatha |

తమ గ్రామంలో చదువుకునే పిల్లలను ప్రైవేటు బడులకు పంపం అని గ్రామంలోకి వచ్చిన ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు.

‘ప్రైవేట్ బడికి పంపం’.. స్కూల్ వ్యాన్‌ను అడ్డుకున్న గ్రామస్తులు
X

దిశ, పెగడపల్లి: తమ గ్రామంలో చదువుకునే పిల్లలను ప్రైవేటు బడులకు పంపం అని గ్రామంలోకి వచ్చిన ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. మండలంలోని సుద్దపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అయితరవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ను అడ్డుకుని ఇక మీదట తమ గ్రామంలోకి ఏ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌లు రాకూడదని తమ గ్రామంలోని పిల్లలను తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం అందరూ కలిసి రావాలని కోరారు. ఇక్కడ ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనివాస్, పంచాయతీ పాలక వర్గం, వివిధ కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story