- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన 'RAPO23'
'RAPO23' చిత్ర పూజ కార్యక్రమాలు మొయినాబాద్ సమీపంలోని ఫార్మ్‌హౌస్‌లో నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: రామ్ పోతినేని స్వయంగా కథ రాసుకుని ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని 'RAPO23' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొయినాబాద్ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంతో రామ్ పోతినేని దర్శకుడిగా తన ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. అలాగే, ఈరోజే తొలి షెడ్యూల్ చిత్రీకరణ కూడా అదే ఫార్మ్‌హౌస్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ చైతన్య నిర్మిస్తున్నారు. సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తుండగా, తిరు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా, ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.






