- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మించారు వదిలేశారు.. వాంకిడిలో నిరుపయోగంగా బస్‌స్టాప్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని 2005లో ప్రయాణికుల సౌకర్యాలు కోసం ఆర్టీసీ అధికారులు రూ.5 లక్షలు వెచ్చించి బస్‌స్టాప్‌ను నిర్మించారు.

దిశ, వాంకిడి: ప్రజాధనాన్ని మట్టి పాలు చేయడమంటే ఇదేనేమో ప్రణాళిక లేక లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్న భవనాలను అధికారులు గాలికి వదిలేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని 2005లో ప్రయాణికుల సౌకర్యాలు కోసం ఆర్టీసీ అధికారులు రూ.5 లక్షలు వెచ్చించి బస్‌స్టాప్‌ను నిర్మించారు. 20 ఏళ్ళు కావస్తున్న నేటి వరకు దాని వినియోగించిన పాపాన పోలేదు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం పాలకుల పట్టింపులేని కారణంగా నేషనల్ హైవే రోడ్డు పక్కనే ఉన్న ఈ బస్ స్టాప్‌కు బస్సులు రావు. బస్సు అక్కడ ఆగదు. దీంతో ప్రయాణికుల కోసం నిర్మించిన బస్ స్టాప్ యాచకులకు నిలయంగా మారింది. ఇక ప్రయాణికులు బస్ స్టాప్ ఉన్న.. ఎండాకాలమైన వానకాలమైన రోడ్లపై నిలుచొని బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న బస్ స్టాప్ ను వినియోగంలో తేవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






