- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిఫిన్ సెంటర్‌ను ధ్వంసం చేసిన దుండగులు.. బాధితుడు తీవ్ర ఆవేదన
గుర్తు తెలియని దుండగులు టిఫిన్ సెంటర్‌ను ధ్వంసం చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు టిఫిన్ సెంటర్‌ను ధ్వంసం చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు లకశెట్టి నాగశెట్టి(రాజు) తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంచాల్ రోడ్డులోని శ్రీ ఉడిపి టిఫిన్ సెంటర్‌ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి సుమారు 11 నుంచి 12 గంటల సమయంలో ధ్వంసం చేశారని, టిఫిన్ సెంటర్‌లోని సామగ్రిని ధ్వంసం చేయడంతో రూ.70 వేల వరకు ఆస్తి నష్టం కలిగించారని యజమాని లకశెట్టి నాగశెట్టి(రాజు) ఆవేదన వ్యక్తం చేశాడు. తన వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశ్యపూర్వకంగానే దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.






