కొత్తసాగుకు శ్రీకారం చుట్టే రోజు : రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

by Naga Rani Yarlagadda |

జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం ఏరువాక.

కొత్తసాగుకు శ్రీకారం చుట్టే రోజు : రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతన్నలు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం ఏరువాక. ఈ రోజును ఏరువాక పున్నమిగా పిలుస్తారు. ఈ సందర్భంగా.. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు సీఎం చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. పాడి పంటలతో రైతన్నల ఇళ్లలో వెలుగులు నిండాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రకృతిని పూజించే గడ్డపై పుట్టిన మనమంతా ఆ సాంప్రదాయాలని పాటిద్దామని పిలుపునిచ్చారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి మన భూమిని, మన ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామన్నారు.

అలాగే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులను జమచేసి అన్నదాతలకు అండగా నిలుస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను రైతన్నలు అధిగమించాలని కోరుకుంటున్నానని, ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పేదే ఈ ఏరువాక పున్నమి అన్నారు. నేలతల్లికి ప్రణమిల్లి కొత్తసాగుకు శ్రీకారం చుట్టడం అనాదిగా వస్తోన్న ఆనవాయితీ అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ పేర్కొన్నారు.

Next Story