- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్‌పల్లిలో దారుణం.. తండ్రిని నరికి చంపిన కొడుకు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మహబూబ్ పల్లిలో దారుణం జరిగింది.

దిశ, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని మహబూబ్ పల్లిలో దారుణం జరిగింది. మహబూబ్ పల్లి గ్రామానికి చెందిన రత్నం సారయ్య(60)ని కొడుకు రవీందర్ అతి కిరాతకంగా ఆదివారం అర్ధరాత్రి గొడ్డలితో నరికి చంపాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటుండగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. రవీందర్ కు 20 ఏళ్ల క్రితం వివాహం కాగా భార్య 3 నెలలకే విడాకులు ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పటినుండి ఇంట్లో సరిగ్గా ఉండడని అతని మానసిక పరిస్థితి బాగోలేదని, ప్రస్తుతం గ్రామ సమీపంలో గల స్మశాన వాటికలో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడని తెలిపారు. సంఘటన పై మహాముత్తారం ఎస్ఐ గొర్ల రమేష్ ను వివరాలు అడుగగా రవీందర్ గత ఏడాది నుంచి తమ భూమికి సంబంధించిన దానిపై తండ్రితో విభేదాలు ఉన్నాయని ఆ విషయంలో గొడవ జరిగి ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు తరలించడం జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






