సీఎంసీ భవన నిర్మాణంపై స్టేటస్ కో.. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం ఫోకస్?

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణాన్ని ఆపివేయాలని పేర్కొంటూ స్టే విధించింది.

సీఎంసీ భవన నిర్మాణంపై స్టేటస్ కో.. ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం ఫోకస్?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణాన్ని ఆపివేయాలని పేర్కొంటూ స్టే విధించింది. భూ నిర్మాణ స్థలంపై హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సుమారు 5 ఎకరాల భూమిని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. రూ.161 కోట్ల అంచనాతో సీఎంసీ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఆ భూమిపై తమకే యాజమాన్య హక్కులున్నాయని జాగృతి ఫౌండేషన్స్, మహిపాల్ రెడ్డి, తదితరులు గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు. మే 30, 2026న శేరిలింగంపల్లి తహసీల్దార్ జారీ చేసిన భూమి స్వాధీనం చర్యలను సవాల్ చేస్తూ ఐదు రిట్ పిటిషన్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేంతవరకూ భూమిపై యథాతథ స్థిని కొనసాగించాలని పేర్కొంటూ కోర్టు నాడు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులైకి వాయిదా వేసింది.

తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. స్టేటస్ కో విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమి వివాదం పరిష్కారమయ్యేంతవరకూ పనులు ముందుకు సాగే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story