'లెనిన్'పై చిరంజీవి ప్రశంసల జల్లు.. అఖిల్‌ నటనకు ఫిదా

by Pulgam srinivas |   (  Updated:2026-07-13 06:22:31  IST  )

'లెనిన్' సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపిస్తూ, అఖిల్ తనకు మరో కుమారుడిలాంటి వాడని వ్యాఖ్యానించారు.

లెనిన్పై చిరంజీవి ప్రశంసల జల్లు.. అఖిల్‌ నటనకు ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తనకు నచ్చిన సినిమాలు విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పుడు లేదా మంచి స్పందన అందుకున్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం తెలిసిందే. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన 'లెనిన్' చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చిత్రంతో పాటు అఖిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెనిన్ గురించి అద్భుతమైన స్పందనలు వింటున్నాను. ముఖ్యంగా అఖిల్ అక్కినేని నటనకు అన్ని వర్గాల నుంచి ఏకగ్రీవ ప్రశంసలు రావడం ఎంతో ఆనందంగా ఉంది.

అఖిల్ నాకు మరో కుమారుడిలాంటి వాడు. ప్రతి సినిమాతో నటుడిగా అతడు మరింత ఎదుగుతున్న తీరు చూసి చాలా సంతోషంగా ఉంది" అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే, "నా ప్రియ మిత్రుడు నాగార్జున గారికి, చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక బృందానికి హృదయపూర్వక అభినందనలు. త్వరలోనే 'లెనిన్' సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం మరింత విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించగా, అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story