ఆ బాలీవుడ్ హీరో‌ రూల్స్ బ్రేక్ చేశాడు.. స్టార్ డైరెక్టర్ ఆరోపణ

by Disha Web Desk 13 |
ఆ బాలీవుడ్ హీరో‌ రూల్స్ బ్రేక్ చేశాడు.. స్టార్ డైరెక్టర్ ఆరోపణ
X

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' గత రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ముంబైలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేయగా.. బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, కరణ్ జోహార్ తదితరులు పాల్గొని రాజమౌళి, తారక్, చరణ్‌పై ప్రశంసలు కురింపించారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ.. 'సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ ఎంత ఒత్తిడికి గురవుతుందో నాకు తెలుసు. 'ఆర్ఆర్ఆర్' విడుదలై ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత రాజమౌళి సర్, ఆయన టీమ్ మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అద్భుతమైన విజయాలు అందుకోవాలని, మంచి సినిమాలతో మమ్మల్ని ఎప్పుడూ ఎంటర్‏టైన్ చేయాలని కోరుకుంటున్నా' అని తెలిపారు. ఇక రాజమౌళి మాట్లాడుతూ.. 'అమీర్ ఖాన్‌కు, నాకు ఒక ఒప్పందం ఉంది. కేవలం పేర్లు పెట్టి పిలుచుకోవాలని.. 'సర్, గారు' అనే పదాలు ఉపయోగించుకోకూడదని ఇటీవలే ఓ అగ్రిమెంట్ పెట్టుకున్నాం. ఆయనను 'సర్' అని కాకుండా 'ఏకే' అని పిలవడానికి నేను ఇబ్బందిపడ్డాను. అమీర్ ఒత్తిడి చేయడంతోనే నేను 'ఏకే' అని పిలిచాను. కానీ ఇప్పుడు ఆయన మా మధ్య ఉన్న అగ్రిమెంట్ బ్రేక్ చేసి నన్ను రాజాజీ అని పిలుస్తున్నారు' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.





Next Story

Most Viewed