- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమెర్జెన్సీగా వెనక్కి తిరిగి వచ్చిన వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరారు.

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరారు. నాసా క్రూ-11 మిషన్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వాహకనౌక 'ఎండీవర్' కొద్దిసేపటి క్రితం కాలిఫోర్నియా తీరం సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో విజయవంతంగా స్ప్లాష్‌డౌన్ అయింది. ఈ మిషన్‌లో నాసాకు చెందిన జెస్సికా మీర్(మిషన్ కమాండర్), జాక్ హాథవే(పైలట్), రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్‌కు చెందిన కిరిల్ ఎస్కోవ్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన జాస్మిన్ మొగ్బెల్లీ పాల్గొన్నారు. గత ఆగస్టు 2025లో అంతరిక్షానికి వెళ్లిన వీరు దాదాపు ఆరు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో పరిశోధనలు చేశారు.
అయితే ISS లో ఒక వ్యోమగామికి మెడికల్ ఎమెర్జెన్సీ రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా నాసా ఈ మిషన్ మధ్యలోనే ఆపేసి వ్యోమగాములను భూమి మీదకి తీసుకువచ్చింది. డ్రాగన్ క్యాప్సూల్ పారాచూట్ల సహాయంతో సముద్రంలో దిగిన వెంటనే స్పేస్‌ఎక్స్ రికవరీ బృందం అక్కడికి చేరుకుని వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసి వైద్య పరీక్షలు నిర్వహించింది. కాగా అనారోగ్యం పాలైన వ్యోమగామి పరిస్థితి తెలియాల్సి ఉంది.






