సీఎం ద్వేషపూరిత ప్రసంగాల కేసు.. హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచన

by Malleboina Mahesh |

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై నమోదైన ద్వేషపూరిత ప్రసంగాల (Hate Speech) కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

సీఎం ద్వేషపూరిత ప్రసంగాల కేసు.. హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచన
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (CM Himanta Biswa Sarma) ద్వేషపూరిత ప్రసంగాల (Hate speech) ఆరోపణల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎంపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court)నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి బదులుగా, పిటిషనర్లు తమ విన్నపాలతో గౌహతి హైకోర్టు (Guwahati High Court)ను ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కీలక అభ్యర్థనను కూడా చేసింది. ఈ పిటిషన్లపై త్వరితగతిన విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది.

న్యాయపరమైన ప్రక్రియలో జాప్యం జరగకుండా, ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్థానిక హైకోర్టులోనే ముందుగా విచారణ జరగడం సముచితమని భావించిన సుప్రీంకోర్టు, ఈ పిటిషన్లను అక్కడకే బదిలీ చేయాలని సూచిస్తూ విచారణను ముగించింది. గౌహతి హైకోర్టు ఇప్పుడు ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Next Story