- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Asian Games 2026: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రకటన
ఆసియా గేమ్స్ 2026 కోసం కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: జపాన్‌లోని ఐచి-నగోయా (Aichi-Nagoya) వేదికగా ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా గేమ్స్ 2026 (Asian Games 2026) కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ (BCCI) మహిళల సెలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. గత ఆసియా గేమ్స్‌లో (చైనాలోని హాంగ్జౌలో) స్వర్ణ పతకం సాధించిన టీమిండియా.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా అత్యంత పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగుతోంది.
హర్మన్‌ప్రీత్ కెప్టెన్.. జట్టు వివరాలు
ఈ మెగా టోర్నీకి హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, విధ్వంసకర ఓపెనర్ స్మృతి మంధాన వైస్-కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుంది. జట్టులో యువ బ్యాటర్ షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, దీప్తి శర్మలతో పాటు వికెట్ కీపర్‌గా రిచా ఘోష్ కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే శ్రేయాంక పాటిల్ ఎంపిక పూర్తిగా ఆమె ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని బోర్డు గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
భారత మహిళల పూర్తి స్క్వాడ్:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ (ఫిట్‌నెస్‌కు లోబడి), రాధా యాదవ్, నందిని శర్మ.






