- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Murali Mohan: చిరంజీవిని చూసి కృష్ణంరాజు అలా అన్నారు.. కానీ నేను అన్నదే నిజమైంది
చిరంజీవి విలన్ కాదు.. ఇండస్ట్రీకి మొగుడు అవుతాడని తాను ముందే చెప్పానని మురళీమోహన్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ, నటనతో పాటు నిర్మాణ రంగంలో కూడా పెద్దగా చురుకుగా కనిపించడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ... చిరంజీవిని చూసిన తొలినాళ్లలో కృష్ణంరాజు గారు 'చిరంజీవి చాలా బాగా నటిస్తున్నాడు.. భవిష్యత్తులో గొప్ప విలన్ అవుతాడు' అని అన్నారు.
కానీ నేను మాత్రం 'చిరంజీవి విలన్ కాదు అండి... ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు' అని చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకుని స్టార్ హీరోగా ఎదిగారు అని తెలిపారు. అలాగే చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా కూడా నన్ను ఎక్కడ కలిసినా ఎంతో మర్యాదగా 'అన్నయ్య' అని పిలుస్తారు. ఆయనకు సంస్కారం, విలువలు చాలా ఎక్కువ అంటూ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మురళీమోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, చిరంజీవి, మురళీమోహన్ కలిసి 'మన ఊరి పాండవులు', 'గ్యాంగ్ లీడర్' వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.






