అభిరామ్ గ్యాస్ దోపిడీకి అశ్వాపురం అడ్డా

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం కేంద్రంగా కొనసాగుతున్న అభిరామ్ గ్యాస్ ఏజెన్సీ వ్యవహారం ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అభిరామ్ గ్యాస్ దోపిడీకి అశ్వాపురం అడ్డా
X

దిశ అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం కేంద్రంగా కొనసాగుతున్న అభిరామ్ గ్యాస్ ఏజెన్సీ వ్యవహారం ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేలాదిమంది వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఏజెన్సీ సాగిస్తున్న వసూళ్ల పర్వం హద్దులు దాటుతుంది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం నిర్నిత ధర కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నిర్వాహకులదే రాజ్యాంగం సాగుతుంది. వసూళ్లలో అభిరామ్ మార్క్ ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరకు అదనంగా వసూలు చేస్తున్నారు నగదు సరిపడ ఇచ్చిన పైన తీసుకున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే, ఏజెన్సీ సిబ్బంది దురుసుగా సమాధానం ఇవ్వడం గమర్నార్హం. 21 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్న ఈ ఏజెన్సీకి రోజుకు సుమారు 500 పైన సిలిండర్లు లారీ లోడ్ వస్తుంది. అంటే ప్రతి సిలిండర్ మీద అదనంగా వసూలు చేస్తున్న ఈ మొత్తాన్ని లెక్కేస్తే నెలకు 1 లక్ష రూపాయల అక్రమ సంపాదనకు తెరలేపుతున్నట్టు స్పష్టమైతుంది.

ఏజెన్సీలో జరుగుతున్న దోపిడీ ఒక ఎత్తు అయితే, క్షేత్రస్థాయిలో డెలివరీ బోయ్స్ ఆగడాలు మరో ఎత్తుకు చేరాయి. డెలివరీ బోయ్స్ వినియోగదారుల ఫోన్లను అస్సలు ఎత్తడం లేదు. ఎవరైతే సిలిండర్ ధరకు అదనంగా మరిన్ని డబ్బులు జెస్తారో, వారికే ప్రాధాన్యతనిస్తూ సిలిండర్లను సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజల కంటే హోటళ్లకు, వాణిజ్య సంస్థలకు, ఎక్కువ డబ్బు ఆశ చూపుతూ గృహ వినియోగ గ్యాస్ లను అక్రమంగా అటువైపు మళ్ళిస్తున్నట్టు స్థానికులు ధ్వజమెత్తుతున్నారు.

దూరభారం... డెలివరీ పాయింట్లు...!

అశ్వాపురం మణుగూరు పినపాక కరకగూడెం మండలాల వరకు ఈ ఏజెన్సీ విస్తరించి ఉంది. మారుమూల గ్రామాల నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గ్యాస్ కోసం వచ్చే సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. డెలివరీ బోయ్స్ ఇంటికి రాకపోవడంతో, చేసేది లేక ప్రజలు కిరాయి వాహనాలు పెట్టుకొని ఏజెన్సీ వద్దకు పరుగులు తీస్తున్నారు అక్కడ కూడా కనీసం కంప్యూటర్ బిల్లులు ఇవ్వకుండానే అక్రమ దందా సాగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల మౌనం... దేనికి సంకేతం...?

ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. గ్యాస్ ఏజెన్సీ ఆగడాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘిస్తూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న అభిరామ్ గ్యాస్ ఏజెన్సీ లైసెన్సును తక్షణమే రద్దు చేయాలని అశ్వాపురం పినపాక ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story