Asaduddin Owaisi: చైనా పేరు చెప్పడానికి ప్రధాని భయపడుతున్నారు : ఒవైసీ

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-02-08 15:49:44  IST  )

Asaduddin Owaisi Criticizes Ajit Doval Over Agnipath Scheme| చైనా పేరును బహిరంగంగా చెప్పడానికి ప్రధాని మోడీ భయపడుతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. అగ్నిపథ్ పథకంపై వెనక్కి

Asaduddin Owaisi Criticizes Ajit Doval Over Agnipath Scheme
X

దిశ, డైనమిక్ బ్యూరో: Asaduddin Owaisi Criticizes Ajit Doval Over Agnipath Scheme| చైనా పేరును బహిరంగంగా చెప్పడానికి ప్రధాని మోడీ భయపడుతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. అగ్నిపథ్ పథకంపై వెనక్కి తగ్గేది లేదంటూ అజిత్ డోవల్ చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. చైనా బలగాలు 2020లో లడఖ్‌లో ప్రవేశించినా దానిని తిప్పికొట్టలేకపోయారని, ఇప్పటికీ వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మన సైనికులు 25 నెలలకుపైగా గస్తీ నిర్వహించడం లేదని ఒవైసీ ఆరోపించారు. చైనా పేరును బహిరంగంగా చెప్పడానికి మన ప్రధాని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లడఖ్ గురించి పార్లమెంటులో నా ప్రశ్నలను తిరస్కరించారని, చర్చ కూడా జరగలేదని అసదుద్ధీన్ ఒవైసీ మండిపడ్డారు.

Next Story