- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. రెబ్బెన పీహెచ్‌సీలో అందుబాటులోకి ఏఆర్వీ ఇంజెక్షన్లు
by Batti.Sumithra |
దిశలో ప్రచురితమైన రెబ్బెన పీహెచ్‌సీలో ఏఆర్వీ ఇంజెక్షన్ల కొరత కథనానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు.

X
దిశ, రెబ్బెన : దిశలో ప్రచురితమైన రెబ్బెన పీహెచ్‌సీలో ఏఆర్వీ ఇంజెక్షన్ల కొరత కథనానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబీస్ (ఏఆర్వీ) ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సీతారాం దిశ ప్రతినిధికి ఫోన్ ద్వారా తెలిపారు. ఏఆర్వీ ఇంజెక్షన్ల కొరత పై సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుని, అవసరమైన స్టాక్‌ను పీహెచ్‌సీకి పంపించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కుక్కలు, కోతులు తదితర జంతువుల కాటుకు గురయ్యే వారికి అవసరమైన ఏఆర్వీ ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఈ సేవలను వినియోగించుకోవచ్చని డా. సీతారాం పేర్కొన్నారు.
Next Story






