- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 WC ఫైనల్ : అర్షదీప్ - మిచెల్ వివాదం.. కారణం ఇదేనా?
నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత బౌలర్ అర్షదీప్ సింగ్ కు, న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ కు వివాదం చెలరేగింది.

దిశ, వెబ్ డెస్క్ : టీ20 మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ పై సూపర్ విక్టరీ సాధించి.. విశ్వవిజేతగా నిలిచింది. దీంతో దేశం సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఈ మ్యాచులోని 11వ ఓవర్లో చిన్న వివాదం చెలరేగింది. టీంఇండియా బౌలింగ్ చేస్తుండగా.. 11వ ఓవర్లో అర్షదీప్ సింగ్ బౌలింగ్ వేస్తున్నాడు. క్రీజులో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. తరువాతి బాల్ ను బౌలర్ వైపు కొట్టాడు. దీంతో అర్షదీప్ కోపంతో బంతికి మిచెల్ మీదికి విసిరాడు. బాల్ ను తృటిలో తప్పించుకున్న మిచెల్.. అర్షదీప్ వైపు కోపంగా దూసుకువస్తూ.. ఇదేం పద్దతి అని అరిచాడు. కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి మిచెల్ ను కూల్ చేశాడు. అంపైర్ ఇరువైపులా సర్దిచెప్పగా.. తరువాత అర్షదీప్ కూడా మిచెల్ కు సారీ చెప్పడంతో వివాదం ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో అర్షదీప్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. వివాదానికి ముందు అర్షదీప్ బౌలింగ్ లో ఒక సింపుల్ క్యాచ్ ను హార్దిక్ వదిలేయడం కూడా బౌలర్ అసహనానికి మరింత కారణం అయి ఉండవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.






