నా కెరీర్‌లో అదొక చెత్త క్యారెక్టర్.. సీనియర్ నటుడు

by Disha Web Desk 17 |
నా కెరీర్‌లో అదొక చెత్త క్యారెక్టర్.. సీనియర్ నటుడు
X

దిశ, సినిమా: 'మున్నాభాయ్' సినిమాతో స్టార్‌డమ్ సంపాదించుకున్న నటుడు అర్షద్ వర్షికి.. ఇందులో పోషించిన 'సర్క్యూట్' క్యారెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ మూవీ 'బచ్చన్ పాండే' లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న అర్షద్.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సర్య్కూట్ పాత్ర నచ్చలేదని తెలిపాడు. 'మున్నాభాయ్ సర్క్యూట్ ఓ చెత్త క్యారెక్టర్. అయితే సంజయ్‌దత్ కోసమే ఈ క్యారెక్టర్‌ చేయడానికి అంగీకరించా. నిజానికి కథ రాసినప్పుడు ఆ పాత్రకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. ఆ విషయం నాతోపాటు దర్శకుడు రాజ్‌కుమార్ హీరానికి కూడా తెలుసు. నాకంటే ముందు ఈ పాత్రని మకరంద్ దేశ్‌పాండే‌కి ఆఫర్ చేయగా ఆయన రిజెక్ట్ చేశాడు. అయితే నా వరకు ప్రేక్షకులకి నచ్చుతుందని అనుకుంటే ఏ జోనర్ పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే' అంటూ వివరించాడు.

ఇక బచ్చన్ పాండే‌లో చేస్తున్న క్యారెక్టర్ అభిమానులకు నచ్చుతుందన్న ఆయన.. అక్షయ్‌తో కామెడీ చేయడం ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్పాడు. ఇక అక్షయ్, అర్షద్ కలిసి 2002లో వచ్చిన 'జానీ దుష్మాన్‌లో నటించగా మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో కనిపించడం విశేషం.

Next Story

Most Viewed