- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏంటో చెప్పి షాకిచ్చిన అరిజిత్ సింగ్.. పోస్ట్ వైరల్
సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరిజిత్ సింగ్(Arijit Singh), ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.

దిశ, సినిమా: సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరిజిత్ సింగ్(Arijit Singh), ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండి, ప్రతి సినిమాకు ఆయన గొంతే కావాలని మేకర్స్ క్యూ కడుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో నెట్టింట చర్చనీయాంశమైంది. అభిమానులు ఆందోళన చెందుతూ పలు పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ విషయం గమనించిన అరిజిత్ సింగ్ తను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని, ఎప్పటి నుంచో తన మనసులో ఉన్న ఆలోచనను ఇప్పుడు ధైర్యం చేసి బయటపెట్టానని ఆయన ఎమోషనల్ అయ్యారు.
అరిజిత్ ఈ రిటైర్మెంట్‌కు ప్రధాన కారణం ‘‘కొత్త తరం గాయకులకు అవకాశం కల్పించడం’’ అని చెప్పారు. ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త సింగర్ల ప్రతిభ తనను ఎంతగానో ఆకట్టుకుందని, తను పక్కకు తప్పుకుంటేనే వారికి సరైన గుర్తింపుతో పాటు అవకాశాలు దక్కుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, తనకు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉంటుందని, అందుకే స్టేజ్ షోలలో కూడా పాత పాటలను కొత్త ట్యూన్స్‌తో పాడుతుంటానని వివరించారు. ఇకపై కేవలం సినిమా పాటలకే పరిమితం కాకుండా, సంగీతంలో మరిన్ని లోతైన విషయాలను నేర్చుకోవడానికి ఈ సమయాన్ని కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అయితే సినిమాలకు గుడ్ బై చెప్పినప్పటికీ, ఆయన ‘ఇండిపెండెంట్ సింగర్’గా తన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నా అని క్లారిటీ ఇచ్చాడు. అంటే తన సొంత మ్యూజిక్ ఆల్బమ్స్, ప్రైవేట్ సాంగ్స్ ద్వారా ఆయన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. తెలుగులో మనం, స్వామి రారా వంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరైన అరిజిత్ కొత్తవారి కోసం తన కెరీర్‌ను త్యాగం చేయడం చూసి నెటిజన్లు అభినందిస్తున్నారు. ఒకరి అవకాశాన్ని లాగేసుకుంటున్న ఈ సమయంలో ఇతరుల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడంపై కాస్త షాక్‌కు గురవుతున్నారు.






