- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ లో విలీనమైన అభివృద్దికి నోచుకోలే
మీర్ పేట్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం కావడం తో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నిధులకు కూడా కొరత ఉండదు

దిశ, మీర్ పేట్ : మీర్ పేట్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం కావడం తో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నిధులకు కూడా కొరత ఉండదు తమ కార్పొరేషన్ వేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయని అనుకున్న ప్రజలకు గ్రేటర్ తో ఏం జరగదు కార్పొరేషన్ ఉన్నపుడే బాగుండే అనుకునే వరకు పరిస్థితి తీసుకువచ్చారు అధికారులు,పాలకులు.బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని మీర్ పేట్ డివిజన్ మీర్ పేట్ కూడలి నుంచి జిల్లెల గూడ వెళ్ళే ప్రధాన రహదారి పై రోడ్డు గుంతలు పడి ఇటీవల కురిసిన వర్షానికి గుంతల లో నీళ్లు నిలవడంతో వాహనదారులకు పాదాచారులను పట్ట పగలు నరకం చూస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్ ..
జిల్లెలగూడ కనకదుర్గ ఆలయం నుండి అల్మాస్ గూడ కమాన్ వరకు 2022లో రూ.7 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్డు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు వేసిన నెలల వ్యవధిలోనే రోడ్డు గుంతలుగా మారింది. పర్యవేక్షించాల్సిన అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కన్నా కార్పొరేషన్ నయం..
గుంతలు పడి నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదనీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నప్పుడు తాత్కాలిక మరమ్మత్తులు చేసైనా అధికారులు చేతులు దులుపుకునేవారు కానీ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదులో విలీనమైన తరువాత అధికారుల తీరు మరింత దారుణంగా తయారయిందని అధికారులు తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య సైతం రోజు అదే రహదారి గుంట వెళ్తూ ఉంటాడు కానీ ఆ రహదారిపై ఉన్న గుంతలు ఆ డిసి కి కనిపించ పోవడం ఆశ్చర్యకరం రహదారి వెంట వెళ్లి వాహనదారులు, నరకం అనుభవిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు చొరవ తీసుకొని వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మీర్ పేట్ బీజేపీ అధ్యక్షుడు తులసి ముఖేష్ ముదిరాజ్
ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి రోజులు గడుస్తున్న అధికారులు కనిపించడం పోవడం దారుణం అన్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.






