Thirsty: పదే పదే దాహం వేస్తుందా.. ఈ 5 వ్యాధులు తలెత్తినట్లే..?

by Kodari Anjali |

మనిషి ఆరోగ్యం(health)గా ఉండాలండే శరీరానికి తప్పనిసరిగా కావాల్సినంత నీరు(water) అవసరం.

Thirsty: పదే పదే దాహం వేస్తుందా.. ఈ 5 వ్యాధులు తలెత్తినట్లే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషి ఆరోగ్యం(health)గా ఉండాలండే శరీరానికి తప్పనిసరిగా కావాల్సినంత నీరు(water) అవసరం. ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి శరీర బరువు(body weight)కు ప్రతి కిలోగ్రాముకు 35 మిల్లీ లీటర్ల వాటర్ అవసరమని నిపుణులు చెబుతుంటారు. కామన్‌గా అయితే ఒక వయోజన శరీరానికి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ తీసుకోవాలంటున్నారు. వాటర్ కణాలకు పోషకాలను తీసుకువెళ్లడంలో మేలు చేస్తుంది.

చెమట(sweat) అండ్ మూత్రం(urine) ద్వారా కోల్పోయిన నీటిని తిరిగి నింపుతుంది. వ్యాయామం(exercise) చేసేటప్పుడు లేదా వెచ్చని ఉష్ణోగ్రతలలో చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా శరీరంలో వాటర్ కొరత ఏ మాత్రం తలెత్తినా డీహైడ్రేషన్(Dehydration) అండ్ పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అయితే కొంతమందికి వాటర్ తాగినాక కూడా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంటుంది. గొంతు పొడిబారినట్లు అనిపించడం, అధికంగా దాహం వేయడం వంటివి అనిపిస్తే చాలా మంది లైట్ తీసుకుంటుంటారు. కానీ పలు అనారోగ్య సమస్యలు(Health problems) వచ్చే అవకాశం ఉందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వాటర్ తాగినాక కూడా మళ్లీ మళ్లీ వాటర్ తాగాలనిపిస్తే శరీరంలో షుగర్ లెవల్స్(Sugar levels) తగ్గిపోతుంటాయి. అలాగే రక్తహీనత సమస్య(Anemia problem) కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. అధిక రక్తస్రావం(Excessive bleeding) వల్ల, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గొంతు పొడిబారిపోతుంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటుగా నోరు పొడిబారడం, అలాగే రొమ్ము(breast), మూత్రపిండాలు(kidneys), క్షయ(Tuberculosis), పారాథైరాయిడ్ (Parathyroid)వంటి క్యాన్సర్లు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story