- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sleeping Position: కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?
చాలా మంది దిండు లేనిదే నిద్రపోరు. దిండు(pillow) ఉపయోగం సౌలభ్యం, పొజిషనింగ్‌కు మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది దిండు లేనిదే నిద్రపోరు. దిండు(pillow) ఉపయోగం సౌలభ్యం, పొజిషనింగ్‌కు మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దిండు ఉపయోగించడం వల్ల, వెన్నెముక సరైన స్థితిలో ఉంటుందని అంటున్నారు నిపుణులు. మృదువైన దిండులతో నిద్రించడం వల్ల తలకు రక్త ప్రసరణ(blood circulation) తగ్గుతుంది, తలకు సాధారణ ఆక్సిజన్ సరఫరాలో కొంత భాగాన్ని తగ్గిస్తుంది. అలాగే రోజూ ఉపయోగించే దిండ్లపై ఎన్నో రకాల బ్యాక్టీరియా (Bacteria), ఆయిల్, చర్మ వ్యాధుల(Skin diseases)కు కారణమయ్యే సూక్ష్మజీవులు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పడుకున్నప్పుడు కంఫర్ట్‌గా ఉండాలన్నా కనీసం దిండ్లను తరచూ మార్చడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే చాలా మంది కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా పడుకోవడం వల్ల ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ అలవాటు శరీరంలోని ఎలాంటి మార్పులకు దారితీస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల హెల్త్ కు ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎడమ లేదా కుడి వైపులా.. రెండు వైపులా కూడా మేలనే అంటున్నారు. ఈ పద్ధతి వెన్నుముకకు ఎంతో మేలు చేస్తుంది. వెన్నెముక(spine) నిటారుగా ఉంచడానికి తోడ్పడుతుందని అంటున్నారు నిపుణులు. కాగా నిటారుగా నిద్రపోవడం వల్ల దిగువ వెన్నెముక..అలాగే తుంటి దిగువ వెన్నెముకలో ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తవని సూచిస్తున్నారు.
అలాగే చాలా సేపు గంటల తరబడి కూర్చుని వర్క్ చేసేవారికి వెన్నెముక వంగిపోయే చాన్స్ ఉంటుంది. కాగా కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడకుంటే వెన్నెముకపై స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే కీళ్ల నొప్పులు(Joint pains) వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. కానీ బాగా ఎత్తులో దిండు పెట్టుకోవడం వల్ల మెడ, వెన్నునొప్పి తగ్గుతుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల, ముఖం తక్కువ ఒత్తిడిని అనుభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.






