అలాంటి వాటివల్ల మాకు పోయేదేమిలేదు.. రూమర్స్‌ను తిప్పికొట్టిన నటి

by Disha Web |
అలాంటి వాటివల్ల మాకు పోయేదేమిలేదు.. రూమర్స్‌ను తిప్పికొట్టిన నటి
X

దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటి అర్చన పురాణ్ సింగ్ పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మద్దతుగా నిలిచింది. కపిల్ శర్మ షోలో హోస్ట్‌గా పనిచేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సిద్ధూ ఇటీవలి పంజాబ్ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఓడిపోతే సిద్ధూకు పోయేదేమీ లేదంటూ అర్చన అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది.

అంతేకాదు సిద్ధూ మళ్లీ షోలో అడుగుపెడితే తన ఉద్యోగం పోతుందంటూ వస్తున్న రూమర్స్‌ను కూడా తిప్పికొట్టింది. 'ఇలాంటి విషయాలు మమ్మల్ని పెద్దగా ప్రభావితం చేయకపోయినప్పటికీ కొన్నిసార్లు వింతగా అనిపిస్తోంది. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. సిద్ధూ ఓడిపోగానే రాజకీయాలనుంచి నిష్క్రమించి మళ్లీ షోలోకి వస్తున్నాడని ఆలోచిస్తున్నారంటే.. ప్రజలు ఈ షో ద్వారా అతనితో ఏ రేంజ్‌లో కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు' అని చెప్పుకొచ్చిన నటి. సిద్ధూ ఎప్పుడైనా తిరిగి రావాలనుకున్నా లేదా మేకర్స్ అతన్ని తిరిగి షోలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్న తాను సంతోషంగా స్వాగతిస్తానని తెలిపింది.

Next Story

Most Viewed