తారా ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Batti.Sumithra |

2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ ఆదేశాలకు అనుగుణంగా తారా ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ తెలిపారు.

తారా ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ ఆదేశాలకు అనుగుణంగా తారా ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ తెలిపారు. తారా ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీషు, తెలుగు, బీబీఏ, బీబీఏ రిటైలింగ్, బి.కామ్ బి.ఎఫ్.ఎస్.ఐ, బి.కామ్ హెచ్.ఆర్, బి.సి.ఏ, కెమిస్ట్రీ, ఫార్మా, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి మొత్తం 16 విభాగాలలో 26 అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె వివరించారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ తప్పనిసరి కాగా, అదనంగా నెట్, సెట్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారికి, బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలతో పాటు సంబంధిత విద్యార్హతలు, బోధన అనుభవ ధృవపత్రాల ఒరిజినల్స్, ఒక జిరాక్స్ సెట్ ను తీసుకొని వచ్చి ఈనెల 23 సాయంత్రం 4 గంటలలోపు తారా కళాశాల కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు 24వ తేదీన ఉదయం 10 గంటల నుంచి తారా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్వ్యూ, డెమో నిర్వహిస్తామని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ వివరించారు. ఎంపిక నిబంధనల ప్రకారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Next Story