AP News: మంత్రివర్గ కూర్పుపై జగన్ కసరత్తు.. వారు సేఫేనా ?

by Dishanational2 |
AP News: మంత్రివర్గ కూర్పుపై జగన్ కసరత్తు.. వారు సేఫేనా ?
X

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కేబినెట్‌లోని మంత్రులందరితో రాజీనామాలు చేయించారు. ఈనెల11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే కేబినెట్ కూర్పు అనేది సీఎం వైఎస్ జగన్‌కు ఒక సవాల్‌గా మారినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్ కూర్పును పూర్తి చేశారని ఈనెల Jagan will release the list of new ministers on April 10న్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 2024 ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్ కూర్పు ఉండబోతుందని తెలుస్తోంది. 2019లో జరిగిన కేబినెట్ కూర్పుకంటే కాస్త భిన్నంగా ఈసారి ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన సీఎం వైఎస్ జగన్ ఈసారి కూడా బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తారని సమాచారం. ఇకపోతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి పదవుల సంఖ్యను తగ్గించనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఈక్వేషన్స్ ఇవే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గం కూర్పుపై చాలా కసరత్తు చేశారని తెలుస్తోంది. 2019లో మంత్రివర్గ విస్తరణ కంటే కాస్త భిన్నంగా ఈసారి కేబినెట్ విస్తరణ చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. గతంలో 25 మంది మంత్రులలో అత్యధికంగా ఏడు పోర్ట్ ఫోలియోలు బీసీలకు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి విస్తరణలో ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో 9మంది బీసీలకు స్థానం కల్పించబోతున్నారని, అనంతరం ఎస్సీలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు సమాచారం. గత కేబినెట్‌లో ఐదుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ప్రాతినిథ్యం వహించగా ఈసారి ఆ సంఖ్య 6కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ, మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఒక్కరికీ చోటు కల్పించబోతున్నారంట. ఇకపోతే రెడ్డి సామాజిక వర్గానికి ముగ్గురుకే కేబినెట్‌లో చోటు కల్పించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కేబినెట్‌లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలుగురుకు సీఎం జగన్ చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఆ సంఖ్యను మూడుకు తగ్గిస్తారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇకపోతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కరికే చాన్స్ ఉంటుందని తెలుస్తోంది.

రెడ్డి సామాజిక వర్గం నుంచి అత్యధిక పోటీ

జగన్ కేబినెట్‌లో రెడ్డి సామాజిక వర్గం నుంచి గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. 2019 కేబినెట్ కూర్పులో సీఎం వైఎస్ జగన్ నలుగురుకి చోటు కల్పించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు చోటు కల్పించారు. అయితే ఈసారి కేబినెట్‌లో రెడ్డి సామాజిక వర్గం నుంచి బెర్త్ ఆశించే వారి సంఖ్య విపరీతంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆర్కే‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనకు ఖాయమనే ధీమాగా ఉన్నారు. ఆ తర్వాత సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(ఐదుసార్లు), కాకాని గోవర్థన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్‌కే రోజా, గడికోట శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవి, అనంత వెంకట్రామిరెడ్డిలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలు తమకు మరోసారి చాన్స్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో వేచి చూడాలి.

ఈ ఆరుగురు సేఫేనా?

ఇకపోతే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలోనూ.. మంత్రులు రాజీనామా చేసిన సందర్భంలోనూ ప్రస్తుత కేబినెట్‌లోని కొందరు మంత్రులు కొత్త కేబినెట్‌లోనూ చోటు దక్కించుకోబోతున్నారని సీఎం జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదారుగురికి మరోచాన్స్ ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఆ ఐదారుగురు ఎవరా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజకీయంగానూ.. మంత్రిగానూ సీనియర్ అయిన బొత్స సత్యనారాయణ సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేశ్‌లు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగిస్తే తనను కూడా కొనసాగించాలని అదే జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed